జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి సోమవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పూలమాల సమర్పించి అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం, జై భీమ్ జై జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామాల ముఖ్య నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.