విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం: బిఎస్ వై జేఏసీ

72చూసినవారు
విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం: బిఎస్ వై జేఏసీ
చేర్యాల పట్టణ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ తుమ్మ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దాడులను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్