మంద కృష్ణ మాదిగ గత ముప్పై సంవత్సరాలుగా చేసిన పోరాటానికి, నిరక్షణ కు న్యాయం జరగడంతో మంద కృష్ణ మాదిగ కు నీరాజనాలు పట్టారు. గురువారం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో వర్గీకరణ పై చారిత్రాత్మకమైన తీర్పు రావడంతో జిల్లా కేంద్రమైన జనగాం అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాని అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మంద కృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ఘనంగా అభినందించారు.