చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పండుగ బాబు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అప్పుడే మా ఆటో డ్రైవర్ల జీవితాలు బాగుపడుతాయని గురువారం అన్నారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభ సక్సెస్ కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పైన, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన, కేసీఆర్ పైన అభిమనాన్ని వొంటిపై బాపు కేసీఆర్ చిత్ర పటం వేసుకొని విన్నూత్న ప్రచారం నిర్వహిస్తున్నాడు.