జనగామ జిల్ల కొడకండ్ల మండల కేంద్రంలోని 1, 2, 3 అంగన్వాడి కేంద్రాల టీచర్లు మహిముద, సరిత ఉప్పల్లక్ష్మి పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యథితిగా సీడీపీఓ శుక్రవారం పూర్వ ప్రాథమిక విద్యార్థులకు అక్షరాభ్యాసం, తల్లులకు, బాలింతలకు, గర్భిణీలకు చేతుల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్, గ్రామకార్యదర్శి, ఆశావర్కర్లు, వీఓ అధ్యక్షురాలు పాల్గొన్నారు.