పాలకుర్తి: తాటిచెట్టుపై నుండి జారిపడిన గీతకార్మికునికి తీవ్ర గాయాలు

67చూసినవారు
పాలకుర్తి: తాటిచెట్టుపై నుండి జారిపడిన గీతకార్మికునికి తీవ్ర గాయాలు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లికి చెందిన గిరగాని సుధాకర్ వృత్తి రీత్యా గీత కార్మికుడు రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాద వశత్తు తాటి చెట్టుపై నుండి జారిపడి తీవ్ర గాయాలపాలైయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పాలకుర్తి ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. గీత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న సుధాకర్ ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్