విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం అందించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం జనగాం జిల్లా పాలకుర్తి సాంఘిక సంక్షేమ పాఠశాల వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదలు, మరుగుదొడ్ల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొని సీజనల్ జ్వరాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు.