సామాన్య కుటుంబంలో జన్మించిన బహుజన వీరుడు, పోరాట యోధుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలో రాణించాలని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఆదివారం జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాల వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.