జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పావని కుమారి భాద్యతలు స్వీకరించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ చేసిన ప్రిన్సిపాల్స్ బదిలీలో భాగంగా గురువారం జనగాం నగరంలోని ధర్మకoచ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాముని పావనికుమారి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ గా భాద్యతలు స్వీకరించిన పావనికి అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలిపారు.