చేర్యాల మండలం పెద్దరాజుపేట గ్రామానికి చెందిన మేకల రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితమే మృతుడి భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలే తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ కుటుంబానికి అవసరాల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు.