జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు పులిగిల్లా ఉపేందర్ ఆధ్వర్యంలో మంగళవారం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2025 బడ్జెట్ లో పేద, మధ్య తరగతుల ప్రజలకు అనుకూలంగా వార్షిక ఆదాయం రూ. 12 లక్షల ఉన్నా పన్ను భారం లేకుండా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.