రైతులందరికీ నష్టపరిహారం అందించే దిశగా కృషి చేస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవిగౌడ్ అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మంగలిబండ తండాలో వడగళ్లకు దెబ్బతిన్న పంటలను శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులు ధైర్యంగా ఉండాలని పంట నష్టం అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.