ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా శ్రీనివాస్

84చూసినవారు
ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా శ్రీనివాస్
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా వంగపల్లి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం చేర్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి తడక లింగమూర్తితో పాటు చేర్యాల మండల స్థాయి, పట్టణ స్థాయి ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్