పోగొట్టుకున్న బ్యాగ్ ను అందించిన యువకుడు

53చూసినవారు
పోగొట్టుకున్న బ్యాగ్ ను అందించిన యువకుడు
జనగాం జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కౌడగాని మల్లయ్య అనే వ్యక్తి గురువారం రాజీవ్ చౌరస్తాలో తనకు సంబంధించిన అతి విలువైన డాక్యుమెంట్లు, పత్రాలు, ఆధార్ కార్డ్స్, డబ్బు, విలువైన కార్డ్స్ పొగుట్టుకున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన యువచైతన్య యూత్ అధ్యక్షుడు ఎడవెళ్లి సోము అనే యువకుడికి దొరకగా పొగుట్టుకున్నబాధితుడికి బ్యాగును ఆదివారం అందించి మానవత్వం చాటుకున్నారు.