పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

6757చూసినవారు
పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, నలుపు రంగుగల ప్యాంట్, గీతల చొక్కా ధరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లింగాల గణపురం పోలీసులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్