కొత్తగూడ ఏకలవ్య ఆదర్శ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ అజయ్ సింగ్ శుక్రవారం తెలిపారు. పదవ తరగతి టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కులం, ఆదాయం, నివాసం మరియు పాస్ ఫొటోస్ ఒరిజినల్ మరియు జిరాక్స్ ధ్రువపత్రాలను అడ్మిషన్ల కోసం సమీప కళాశాలలో నమోదు చేసుకోవాలన్నారు.