మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ ప్రజల సంక్షేమానికి బడ్జెట్ను వినియోగిస్తుందన్నారు. ప్రజల సమస్యలో భాగంగా బయ్యారంలోని తులారం ప్రాజెక్ట్ కూడా ముందంజలో ఉంది. కాబట్టి దానిని కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు నీటి పారుదల సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.