
లైబీరియా నౌక మునక ఘటన.. యజమాని, సిబ్బందిపై కేసు
ఇటీవలే కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ఓ నౌక ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా నౌకను నడిపినందుకు యజమాని, మాస్టర్, సిబ్బందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నౌకలోని 640 ఇంధన కంటైనర్లు సముద్ర జలాల్లో పడిపోయాయి. ప్రమాదకర రసాయనాలు భారీగా లీకవ్వడంతో సముద్రంలోకి వెళ్లొద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా జాలర్లను కేరళ ప్రభుత్వం హెచ్చరించింది.