మానుకోట పాతబజార్ లోని హనుమాన్ దేవాలయం మారుతి కుటీరం ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్ నగర సంకీర్తన పట్టణ పురవీధుల్లో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరిగింది. సింధూర అర్చన, పంచామృత అభిషేకాన్ని ఆలయ అర్చకులు సందీప్ శాస్త్రి నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, బాణా సంచా మోతలతో నగర సంకీర్తన జరిగింది.