మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జామ తండాలో మంగళవారం ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 లక్షల 40 వేల విలువచేసే నల్ల బెల్లం 22 క్వింటాళ్ల పట్టికను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.