ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ముత్యాలమ్మ గూడెంలో హైదరాబాద్ కు చెందిన వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ఐటీడీఏ ఏటూరు నాగారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాలికల కోసం విద్యా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు డీ కోటేశ్వరి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి, వివిధ రంగాలలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడానికి ఇది స్థాపించబడిందన్నారు.