జర్నలిస్టు కెఎస్ఆర్ ను విడుదల చేయాలి జర్నలిస్టుల నిరసన

67చూసినవారు
జర్నలిస్టు కెఎస్ఆర్ ను విడుదల చేయాలి జర్నలిస్టుల నిరసన
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కు నిరసనగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్ట్ ల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ల పట్ల కక్షపూరిత వైఖరి సరైనది కాదని, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.