మాహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటించారు. సన్న బియ్యం లబ్ధిదారులైన వారి ఇంట్లో భోజనం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్న బియ్యంపై పాట పాడిన మంత్రి సీతక్క, సన్న బియ్యం పథకంపై కళాకారులు పాడిన పాటలకు చప్పట్లు కొడుతూ పాట పాడారు. సన్న బియ్యం పథకం వచ్చేనా హ పేదోళ్ళు కడపు నింపేనా అంటూ మంత్రి సీతక్క పాడిన పాటకు జనం చప్పట్లు కొట్టారు.