కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంస్థగత ఎన్నికలలో కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సల్మాన్ పాషా కు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన పార్టీ సంస్థాగత కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు అయిన రవళి రెడ్డి లకు సల్మాన్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. సల్మాన్ 2004 నుండి 2008 వరకు ఉమ్మడి కొత్తగూడ మండలానికి ఎన్ఎస్‌యూఐ మండల అధ్యక్షుడిగా పనిచేసినట్లు తెలిపారు.