గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్, ఎఫ్డిఓ చంద్ర శేఖర్ , కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ లు కలిసి పులి ఆనవాళ్ళ కొరకు అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండంగా, రాంపూర్ అటవీ ప్రాంతంలోని మగ పులి ఆనవాళ్ళను మరోసారి కనుగొన్నారు.