మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోలారం గ్రామంలో శనివారం వన వాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం వనవాసి కళ్యాణ పరిషత్ ఏకో ఉపాధ్యాయుడు వజ్జ వీరభద్రస్వామి కూరగాయలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాసం రమేష్. మండల కోఆర్డినేటర్ వట్టం రమేష్ , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.