మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల యూనిట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ గంగారం మండలంలోని పునుగొండ్ల గ్రామంలో తునికాకు సేకరిస్తున్నాడు. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి కట్టలు తడిశాయి. వాటిని దులుపుకుంటూ తిప్పి పెట్టాల్సి ఉంటుంది. అందుకు పెద్దవారిని పనికి పిలిస్తే ఒకరికి కూలీ రూ. 400 ఇవ్వాల్సి వస్తుంది. అది మిగిల్చుకోవాలనే కక్కుర్తితో స్థానికంగా కనిపించిన చిన్నారులకు 1000 కట్టల తిప్పివేస్తే రూ. 20 ఇస్తానని చెప్పి శుక్రవారం మండుటెండ లో పనులు చేయించుకున్నాడు.