మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలో మానుకోట జిల్లా సిపిఐ మహాసభలు శనివారం ప్రారంభించారు. కురవి ప్రధాన వీధుల గుండా కమ్యూనిస్టుల భారీగా మహాప్రదర్శన నిర్వహించారు.
కామ్రేడ్ లియకత్ అలీ, కామ్రేడ్ సురేందర్ కుమార్ మైదానం ప్రాంగణంలో బహిరంగసభ కు ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారు.