జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవంను పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుండి నెహ్రూ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ , జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భముగా వైద్యాధికారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు కలిసికట్టుగా కృషిచేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని అన్నారు.