మహబూబాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం లంబాడి హక్కుల పోరాట సంఘం సభ్యులు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని 107 సర్వే నెంబర్లు దాదాపు రూ. 1000 కోట్ల విలువ చేసే భూమిని కబ్జాదారుల చరణ్ నుంచి విడిపించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు.