మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గురువారం విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం కూడా ఎస్ఎస్సి ఫలితాలలో గత ఒరవడిని కొనసాగిస్తూ 6 నుండి 9 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.