జాతీయ నులిపురుగుల దినోత్సవం విజయవంతం చేయడంపై మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వైద్య సిబ్బంది ద్వారా తప్పకుండా మందులు పంపిణీ చేయాలని కోరారు. ప్రతి అధికారి తమ బాధ్యత గా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లోని పలువురు అధికారులు పాల్గొన్నారు.