మహబూబాబాద్ జిల్లా కామేపల్లి మండలం పరిధిలోని స్థానిక శక్యూనాయక్ తండాలో ఘనంగా ప్రథమ బొడ్రాయి ప్రతిష్ట సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం హనుమాన్ జయంతి రోజున బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా పోయిన యేడాది శక్యూనాయక్ తండాలో బొడ్రాయి ప్రతిష్టించారు. ఈ గ్రామంలో ఊరికి దేవతగా భావించే బొడ్రాయి తల్లి అమ్మవారిని పూజించుకోవడానికి బోనాలతో నైవేద్యం సమర్పించి మేళతాళాలతో, డప్పు సప్పులతో, డీజేతో ఊరేగింపుగా సందడి చేశారు.