మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక హనుమంతుని గడ్డ ఏరియాలోని హనుమంతుని ఆలయాన్ని మర్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో పూర్తి వ్యయంతో నిర్మిస్తామని యువ మంచ్ బాధ్యులు మదన్ గోపాల్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గత 80 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఈ ఆలయం యొక్క ధూప దీప నైవేద్యాల సేవలు చేశారని అదే బాధ్యతతో మేము 2025 సంవత్సరంలో భూమి పూజ ప్రారంభించి 2026 సంవత్సరం వరకు ఆలయాన్ని పునర్నిర్మానం చేస్తామని తెలిపారు.