మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆర్టీసీ ఉద్యమంలో ప్రభుత్వం అక్రమ కేసులు విధించిందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విధించిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు, కార్య కర్తలు, పలువురు మహిళలు పాల్గొన్నారు.