హైదరాబాద్ రాజ్ భవన్ ప్రాంగణంలో సంస్కృతి భవన్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్బంగా ఏర్పాటు చేసిన మెడిసిన్ ఎక్స్ లెన్స్ స్టేట్ బెస్ట్ డాక్టర్ అవార్డును హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా మహబూబాబాద్ GGH, CS, RMO డాక్టర్ జగదీశ్వర్ శనివారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పీవీ ప్రసాద్, రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ యుగంధర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.