మహబూబాబాద్: భారీగా తరలిస్తున్న బెల్లం పట్టివేత

71చూసినవారు
మహబూబాబాద్: భారీగా తరలిస్తున్న బెల్లం పట్టివేత
మహబూబాబాద్ జిల్లా అనంతారం నుండి మొగిలిచర్ల మధ్యనున్న అటవీ ప్రాంత పరిసరాలలో నాటుసారా స్థావరాలపై, బెల్లం పటిక రవాణా పై ఎక్సైజ్ సిఐ చిరంజీవి ఆధ్వర్యంలో శనివారం ఎక్సైజ్ ఎస్ఐ అశోక్ సిబ్బంది దాడులు నిర్వహించారు.
180 బస్తాల నల్లబెల్లం 90 క్వింటాల నల్లబెల్లం, 20బస్తాలలో 10క్వింటాల పటిక, 60 లీటర్ల సారాయి, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి సారా తయారీకి సిద్ధంగా ఉన్నటువంటి 1, 000లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు. వాహనం సీజ్ చేసి ముగ్గురు పై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్