భూమి, భూక్తి, దేశ విముక్తి కోసం విరోచితంగా సాగిన పోరాటాల స్పూర్తితో ఏర్పడిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర విలీన సభ ఫిబ్రవరి 5న సూర్యాపేటలో నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బయ్యారం మండల కేంద్రం, దొరన్న స్మారక భవనంలో మంగళవారం ఈ సభకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి చారి హరీష్ ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.