మహబూబాబాద్: ఆలయ విగ్రహప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్సీ

61చూసినవారు
మహబూబాబాద్: ఆలయ విగ్రహప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్సీ
మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా సోమవారం ధ్వజ స్థంభం, విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు-సంధ్యారాణి దంపతులు పాల్గొన్నారు. ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న దంపతులు, గౌడసంఘం జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్న గౌడ్ దంపతులు, బాషికాల అంబరిష, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్