జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని స్థానిక గుమ్ముడూరులోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల నందు ప్రిన్సిపల్ డి. రాజేష్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ డి. రాజేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ఓటు ద్వారా సమర్ధవంతమైన ప్రభుత్వాలను ఎన్నుకోవాలని పేర్కొన్నారు.