మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెడ్డి బజార్ నందు ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభించారు మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రి యాజమాన్యం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో సేవలందించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రేమగా పలకరించాలని, వారి సమస్యలను తెలుసుకొని మెరుగైన సేవలందించాలని, వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా సిబ్బంది ముందు ఉండాలని అన్నారు.