త్యాగానికి ప్రతీక అయినటువంటి మొహర్రం పండుగ సందర్బంగా మహమ్మద్ ప్రవక్త మనవళ్లు హాసన్, హుస్సేన్ చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మహబూబాబాద్ పట్టణంలో స్థానిక కోర్టు ఆవరణలో ముబీన్ చికెన్ సెంటర్ అధ్యర్యంలో సుమారు 600 మందికి శరబత్ ఆదివారం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్, మతిన్, ఉమర్, రజాక్, జాకిర్, జావీద్, మొహాల్లి, నవాజ్, ఆఫ్సార్, తదితరులు పాల్గొన్నారు.