మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో 24 వార్డ్ ఇంద్ర నగర్ కాలనీలోని షారోన్ చర్చి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం క్రిస్మస్ వేడుకలలో మహబుబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ పాల్గొన్నారు. సమాజరుగ్మతలను పార దోలడానికి ఏసుప్రభు చేసిన కృషికి గుర్తుగా ఆయనను స్మరించుకుంటూ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని అన్నారు. క్రిస్మస్ పండుగ వేడకులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.