మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీలో భారీ చోరీ కేసును బుధవారం పోలీసులు చేదించారు. నిందుతున్ని వద్ద నుండి 5 లక్షల పైగా నగదు, బంగారు రెండు రింగులు, బైక్, వెండి బ్రా స్లైట్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు మహబుబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు తెలిపారు. పెనుగొండ శివారు మచ్చ తండా సమీపంలో వాహనం తనిఖీ లో పట్టుబడినట్లు వెల్లడించారు.