మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి నుండి మంగళవారం నుండి తిరిగి రాకపోకలు పునరుద్ధరించారు. మూడవ రైల్వేలైన్ నిర్మాణపనుల మూలంగా గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి నుండి రాకపోకలను నిషేధించారు. ఈరోజు పునరుద్ధరించడంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. రాకపోకలు పునరుద్ధరించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.