మహబూబాబాద్ నియోజకవర్గంలో రూ. 2లక్షల లోపు ఉన్న రైతులకు సాంకేతిక సమస్య వల్ల రుణమాఫీ కాలేదని రైతులు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ దృష్టికి తీసుకువచ్చారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని రెండు లక్షల లోపు ఉన్న రైతులకు ఎవరెవరికి రుణమాఫీ కాలేదో ఆ రైతుల జాబితాను అధికారుల నుండి సేకరించి బుధవారం సచివాలయంలో ప్రభుత్వ అగ్రికల్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు కలిసి రుణమాఫీ చేయాలని కోరారు.