డిల్లీలో లగచర్ల బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి, అండగా ఉంటామని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత భరోసా ఇచ్చారు. సోమవారం వారిని ఢిల్లీ లో కలిసి అదైర్యపడకండి అంటూ ఓదార్చి, దైర్యం చెప్పారు. ఫార్మా కంపెనీ కోసం భూములు కోల్పోతున్న రైతుల అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేసేందుకు గిరిజన కుటుంబాలు ఢిల్లీ కి చేరుకున్నారు.