మహబూబాబాద్ శివారు గాంధీ పురం సమీపంలో శుక్రవారం మహబూబాబాద్ రూరల్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలకు జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఇటీవల కాలంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో తనీఖీలు ముమ్మరం చేశారు.