మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ మాజీసర్పంచ్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు నల్లాని నవీన్ రావు అధ్యక్షతన అమలు కానీ రాష్ట్రప్రభుత్వపథకాలు, ఇందిరమ్మ ఇండ్లపధకంలో అవకతవకలు పై మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మునిగలవీడు గ్రామం నుండి దాదాపు 150 మోటార్ సైకిళ్లతో ర్యాలీగా నెల్లికుదురు చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.