

అగ్ని ప్రమాదం.. పిల్లల్ని కాపాడేందుకు తల్లి సాహసం (వీడియో)
గుజరాత్లోని అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను రక్షించేందుకు పెద్ద సాహసమే చేశారు. బాల్కనీ నుంచి తన ఇద్దరు పిల్లలను స్థానికుల సాయంతో కిందకు దింపి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 20 మందిని కాపాడారు.